Kohli team: నీటిపై దూసుకెళ్లనున్న కోహ్లి జట్టు..! 1 y ago
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి జట్టు నీటిపై దూసుకెళ్లనుంది. ప్రపంచ టైటిల్ కోసం పోటీపడనుంది. నిజమే.. కానీ అది క్రికెట్ జట్టు కాదు. బోటింగ్ జట్టు. టీమ్ బ్లూ రైజింగ్ పవర్ బోటింగ్ జట్టును కోహ్లి కొనుగోలు చేశాడు. మొట్టమొదటి ప్రపంచ ఎలక్ట్రిక్ పవర్ బోటింగ్ ఛాంపియన్షిప్లో ఈ టీమ్ పోటీపడనుంది. కోహ్లి మాత్రమే కాదు.. టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్, బాస్కెట్బాల్ లెజెండ్ లెబ్రాన్ జేమ్స్ కూడా జట్లను సొంతం చేసుకున్నారు. క్రీడా, సంగీత, వినోద రంగాలకు చెందిన ప్రముఖులు జట్లను కొనుగోలు చేయడం విశేషం. జెద్దా, మియామి, మాంటేకార్లో, దోహాలలో ఈ పోటీలు జరుగుతాయి.